Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఏడుపాయలలో ఈనెల 11 నుండి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

    Author VENKATESH | 07 Oct 2026, 12:50 PM | Bhakti
    ఏడుపాయలలో ఈనెల 11 నుండి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

    రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మెదక్‌ జిల్లా పాపన్నపేటలోని ఏడుపాయల వనదుర్గ భవాని మాత సన్నిధిలో ఈనెల 11 నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించను న్నట్లు ఆలయ చైర్మన్‌ వీరేశం తెలిపారు.ఈనెల 11న బాల త్రిపుర సుందరి దేవిగా, 12న గాయత్రీ దేవిగా, 13న అన్నపూర్ణాదేవి, 14న మహా చండి, 15 మహాలక్ష్మి, 16 సరస్వతి దేవి, 17న లలిత త్రిపుర సుందరి దేవిగా, 18న దుర్గాదేవి, 19 న మహిషాసుర మర్దిని, 20 శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనం ఇవ్వనట్లు ఆయన వెల్లడించారు. ఈనెల 15న అమ్మవారికి బోనాలు తీసే కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.