Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎర్రవల్లిలో ఆ భూముల లెక్కలు తేల్చండి..

    Author VENKATESH | 06 Oct 2026, 09:43 PM | TELANGANA
    ఎర్రవల్లిలో ఆ భూముల లెక్కలు తేల్చండి..

    సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు గ్రామాల్లో సర్వే వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ - 325లో మొత్తం 388 ఎకరాల భూమి ఉందని అధికారులు తెలిపారు. రెవెన్యూ అధికారుల సర్వేలో 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారని అన్నారు. ఈ సర్వే నంబర్‌లో 45 ఎకరాల భూమి కనిపించలేదని అధికారులు చెప్పుకొచ్చారు. ఆ 45 ఎకరాలు ఎక్కడుందో తేల్చాలని అధికారులను సీఎం ఆదేశించారు.ఆ భూమి గుర్తింపు కోసం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో భాగంగానే ఆ భూమి సరిహద్దులో ఉన్న మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు రెవెన్యూ రికార్డులు సబ్‌మిట్ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. సర్వే నంబర్ - 325లో ఉన్న భూమిని స్థానిక అర్హులైన రైతులకు ప్రభుత్వం పంపిణీ చేయనుంది. సర్వే నంబర్-325లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మాణం చేయాలని సీఎం ఆదేశించారు.