Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారంటూ వృద్ధుడికి బెదిరింపులు..

    Author VENKATESH | 05 Oct 2026, 11:47 AM | TELANGANA
    ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారంటూ వృద్ధుడికి బెదిరింపులు..

    ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారంటూ వృద్ధుడిని బెదిరించి.. లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. షేట్‌బషీర్‌బాద్‌కు చెందిన 72 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసం చేశారు. ముంబై పోలీస్ అధికారులమంటూ సదరు వృద్ధుడికి సైబర్ కేటుగాళ్లు ఫోన్ చేశారు. రూ.2 కోట్లు ఉగ్రవాద సంస్థలకు సమకూర్చారంటూ బెదిరింపులకు దిగారు. మనీలాండరింగ్ కేసు నమోదైందంటూ భయపెట్టారు. వీడియో కాల్ చేసి ఓ సీనియర్ పోలీస్ అధికారినంటూ మరో వ్యక్తిని వృద్ధుడికి పరిచయం చేశారు.అంతేకాకుండా విషయం ఎవరికైనా చెబితే కుటుంబసభ్యులను కూడా కేసులో ఇరికిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. కేసు నుంచి తప్పించేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. కేసు విషయంలో భయాందోళనకు గురైన వృద్ధుడు.. డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. దీంతో బాధితుడి నుంచి విడతల వారీగా డబ్బులు వసూలు చేశారు. దాదాపు రూ.55.20 లక్షలు కాజేశారు.