Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తిరుమలకు ఆ వాహనాలకు ఇక నో ఎంట్రీ, TTD కీలక నిర్ణయం..!!

    Author VENKATESH | 03 Oct 2026, 02:45 PM | తిరుపతి
    తిరుమలకు ఆ వాహనాలకు ఇక నో ఎంట్రీ, TTD కీలక నిర్ణయం..!!

    తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాపిడో, ఓలా, ఉబర్ వంటి యాప్‌ల ద్వారా బుక్ చేసుకునే బైక్ రైడ్స్‌ను తిరుమలకు అనుమతించకూడ దని నిర్ణయించింది. ఈ మేరకు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద బైక్ రైడ్స్‌కు అనుమతి లేదంటూ పోస్టర్లు ఏర్పాటు చేసింది. తిరుమల కిటకిట, భక్తుల నిరసనలు- రద్దీ తగ్గే వరకూ ఇక... టీటీడీ కీలక నిర్ణయం..!! గత నెల 26వ తేదీన హైదరాబాద్‌కు చెందిన సునీల్‌ శ్రీవారి దర్శనం ముగించుకుని తిరుపతి ఎయిర్‌పోర్టుకు రాపిడో బైక్‌ను బుక్‌ చేసుకున్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే క్రమంలో తిరుమల మొదటిఘాట్‌రోడ్డులోని 26వ మలుపు వద్ద వేగంగా క్యాష్‌బారియన్‌ను ఢీకొనడంతో రాపిడో బైకర్‌ అక్కడికక్కడే మృతి చెందగా, సునీల్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని టీటీడీ తీవ్రంగా పరిగణించింది. దీంతో.. తిరుమల, ఘాట్‌రోడ్లలో రాపిడో, ఉబర్‌, ఓలా బైక్‌ రైడ్‌లను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే అలిపిరి తనిఖీ కేంద్రంలో 'నాట్‌ ఎలౌడ్‌' అనే పోస్టర్లను ఏర్పాటు చేశారు. 'తిరుమల ఘాట్‌ రోడ్లలో కేవలం వ్యక్తిగత ద్విచక్రవాహనాలకు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది. రాపిడో, ఓలా, ఉబర్‌ తదితర యాప్‌ల ద్వారా బుక్‌ చేసుకున్న ద్విచక్రవాహనాలు తిరుమలకు అనుమతించబడవు' అంటూ పేర్కొంది.