Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆసియా క్రీడ‌ల ఫైన‌ల్లో అభిషేక్ సిక్స‌ర్ల మోత‌..

    Author VENKATESH | 03 Oct 2026, 02:23 PM | Sports
    ఆసియా క్రీడ‌ల ఫైన‌ల్లో అభిషేక్ సిక్స‌ర్ల మోత‌..

    ఆసియా క్రీడల్లో భార‌త ఓపెనింగ్ బ్యాట‌ర్‌ అభిషేక్ శ‌ర్మసిక్స‌ర్ల మోత మోగించాడు. పాకిస్థాన్‌ తో జ‌రిగిన‌ ఫైనల్ మ్యాచ్‌ లో చెలరేగిపోయాడు. ఆట ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో టీ20ల్లో అత్యంత వేగంగా 400 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రికార్డు అత‌డు సృష్టించాడు. ఈ క్రమంలో క్రిస్‌ గేల్‌ ను కూడా అభిషేక్‌ వెనక్కి నెట్టాడు. అంతేగాక‌ భారత్‌-పాక్‌ అంత‌ర్జాతీయ టీ20 మ్యాచ్‌ల‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగానూ నిలిచాడు.పాకిస్థాన్‌తో ఆసియా క్రీడల స్వర్ణ పతక పోరులో అభిషేక్‌ శర్మ తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. రెండో ఓవర్‌లోనే తొలి సిక్సర్‌ బాదిన అతడు.. ఆ తర్వాత అదేజోరు కొనసాగించాడు. వరుసగా భారీ షాట్లు ఆడుతూ పాక్‌ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో తన నాలుగో సిక్సర్‌ బాదిన వెంటనే టీ20ల్లో 400 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. ఇందుకు కేవ‌లం 3,513 బంతులే తీసుకున్నాడు. గతంలో క్రిస్‌ గేల్‌ 3,557 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో ఆండ్రీ రస్సెల్‌ 3,027 బంతులతో 400 సిక్స‌ర్‌లు బాది తొలి స్థానంలో ఉన్నాడు.