Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వికారాబాద్‌లో ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య

    Author VENKATESH | 03 Oct 2026, 11:12 AM | వికారాబాద్
    వికారాబాద్‌లో  ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య

    జిల్లాలోని పూడురు మండలం సోమన్‌గర్తి సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మమత అనే మహిళ తన ఇద్దరు పిల్లలు సాకేత్(8), జనశ్రీ(4)తో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. పుట్టిళ్లు నారాయణపూర్ గ్రామానికి వెళ్తున్నానని భర్తతో చెప్పి కొడుకు, కూతురిని తీసుకుని మమత ఇంటి నుంచి బయలుదేరింది. అయితే మార్గమధ్యలో సోమన్‌గర్తి గ్రామ సమీపంలో పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమయం గడుస్తున్నప్పటికీ మమత నుంచి సమాచారం లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.ఆమె కోసం వెతుకగా సోమన్‌గర్తి సమీపంలో పిల్లలతో కలిసి మమత బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో బావిలో దూకిన ఈతగాళ్లు తల్లి మమత, కూతురు జనశ్రీ మృతదేహాలను వెలికితీశారు. కొడుకు సాకేత్ మృతదేహం కోసం బావిలో గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరీశీలించారు.