Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గ్రామకంఠాల మినహాయింపులపై చంద్రబాబు ఆదేశాలు

    Author VENKATESH | 03 Oct 2026, 11:09 AM | ANDHRA PRADESH
    గ్రామకంఠాల మినహాయింపులపై చంద్రబాబు  ఆదేశాలు

    ప్రభుత్వం అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో అమరావతి పరిధిలో భూముల సమీకరణను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో అమరావతి పరిధిలోని పలు గ్రామాలను, వాటిని ఆనుకుని ఉన్న పశువుల కొట్టాలను గ్రామకంఠాల కింద పరిగణించి.. భూసమీకరణ నుంచి మినహాయించారు. అయితే.. తమ భూములను కూడా గ్రామకంఠాల కింద పరిగణించి.. భూసమీకరణ నుంచి మినహాయించాలని కొందరు రైతులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఆర్డీఏ రూపొందించిన నిబంధనలను అనుసరించి.. ప్రభుత్వం కొంతమంది రైతుల భూముల మినహాయింపునకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.