Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బీచ్‌లో మునిగి ఎనిమిది మంది కాలేజీ విద్యార్థులు మృతి

    Author VENKATESH | 01 Oct 2026, 09:20 PM | NATIONAL
    బీచ్‌లో మునిగి ఎనిమిది మంది కాలేజీ విద్యార్థులు మృతి

    మ‌హారాష్ట్ర‌లో ఘోర విషాదం జ‌రిగింది. స‌ర‌దాగా బీచ్‌కు పిక్నిక్‌ వెళ్లిన ఎనిమిది మంది విద్యార్థులు స‌ముద్రంలో గ‌ల్లంత‌య్యారు. వారి మృత‌దేహాల‌ను అధికారులు వెలికితీశారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌, రాయ్‌గ‌ఢ్ జిల్లాలోని దివేగ‌ర్ బీచ్‌లో గురువారం సాయంత్రం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలివి. పూనే జిల్లాలోని అలాండిలోని ఒక ప్రైవేటు కోచింగ్ సెంట‌ర్‌కు చెందిన కొంద‌రు 11, 12 త‌ర‌గ‌తుల విద్యార్థులు రాయ్‌గ‌ఢ్ శ్రీవ‌ర్ధ‌న్ తాలూకాలోని దివేగ‌ర్ బీచ్‌కు పిక్నిక్‌కు వ‌చ్చారు.
    ఇది స్థానికంగా చాలా ప్ర‌ముఖ‌మైన ప‌ర్యాట‌క కేంద్రం. మొత్తం 48 మంది విద్యార్థులు ఈ బీచ్‌కు వ‌చ్చారు. వీరిలో 25 మంది అబ్బాయిలు, 17 మంది అమ్మాయిలు, ఆరుగురు టీచ‌ర్లు ఉన్నారు. బీచ్‌కు వ‌చ్చిన త‌ర్వాత స‌ముద్ర జ‌లాల్లో ఆడుకునేందుకు కొంద‌రు విద్యార్థులు నీళ్ల‌లోకి వెళ్లారు. ఈ క్ర‌మంలో నీటి లోతును, అల‌ల‌ను అంచ‌నా వేయ‌లేక‌పోవడంతో ఆ నీటిలోనే కొట్టుకుపోయారు. ఎనిమిది మంది విద్యార్థులు మునిగిపోవ‌డంతో టీచ‌ర్లు, తోటి విద్యార్థులు వెంట‌నే స్థానికులు, రెస్క్యూ బృందాల‌ను అల‌ర్ట్ చేశారు. వారు వేగంగా స్పందించి రంగంలోకి దిగారు