Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గాంధీ పథం ప్రగతి రథం

    Author VENKATESH | 01 Oct 2026, 09:08 PM | కరీంనగర్
    గాంధీ పథం   ప్రగతి రథం

    అహింసను ఆయుధంగా
    చేసుకొని శాంతి మార్గంలో
    స్వతంత్ర్య పోరాటాన్ని
    నడిపిన నాయకుడు
    మహాత్మా గాంధీ
    నా జీవితమే నా సందేశం అని
    సత్యాగ్రహ సంస్కృతిని చాటి
    జగతిన భారత్ ఖ్యాతిని పెంచిన
    ఘనుడు బాపూజీ
    ఐక్యరాజ్య సమితి గాంధీ పుట్టిన
    రోజును అంతర్జాతీయ అహింసా
    దినోత్సవంగా ప్రకటించి
    గాంధీ బోధనలు విశ్వవ్యాప్తం
    చేయడములో విశేష కృషి
    చేస్తుంది. ప్రపంచ దేశాల మధ్య
    శాంతి సుస్థిరతకు బాపూజీ
    సిద్ధాంతాలే ప్రధాన భూమిక
    నిర్వహించడం భారతీయులకు
    గర్వకారణం
    పారిశుధ్యం స్వాతంత్రం కన్న
    మిన్న అని పరిశుభ్రతకు బాట
    చూపాడు
    పచ్చదనం పర్యావరణం
    చేతివృత్తుల రక్షణ స్వదేశీ
    కుటీర పరిశ్రమలే అభివృద్ధికి
    పట్టుకొమ్మలని నినదించాడు
    గ్రామీణ స్వరాజ్యం ద్వారానే
    సురాజ్యం సిద్ధిస్తుందని
    పరితపించాడు
    మార్పుకు వ్యక్తి కేంద్రం కావాలి
    జీవితంలో బాధ్యతలు గుర్తు చేస్తూ
    చెడు అనకు చెడు చూడకు చెడు
    వినకు అనే మంచి మార్గమును
    మానవాళికి నేర్పాడు
    బాపూజీ చూపిన సత్యం
    అహింస స్వచ్ఛత సూత్రాలే
    మన జీవన శైలి కావాలి
    బాపూజీ కలలు గన్న నిర్మల
    భారత్ దేశాన్ని సాకారం
    చేయడమే మనము మహాత్మునికి
    ఇచ్చే నిజమైన జన్మదిన నివాళి
    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు
    తెలంగాణ ఎకనామిక్ ఫోరం రచయిత కాలమిస్ట్
    కరీంనగర్ 9440245771