Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వివేకా హత్య కేసులో ఈడీ విచారణ..

    Author VENKATESH | 28 Sep 2026, 11:57 AM | ANDHRA PRADESH
    వివేకా హత్య కేసులో ఈడీ విచారణ..

    మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు(సోమవారం) ఉదయం ఈ కేసుకు సంబంధించి ఎర్ర గంగిరెడ్డి.. ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ హత్య కేసులో ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్, మనీ ట్రైయల్స్‌పై ఎర్ర గంగిరెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. 2019 నుంచి ఇప్పటివరకు బ్యాంకు ఖాతాల వివరాలపైనా విచారణ జరపనున్నారు.వివేకా హత్యకు నలభై కోట్ల సుపారీ ఒప్పందం, కోటి రూపాయలు అప్రూవర్‌గా మారిన దస్తగిరికి అడ్వాన్స్‌గా ఇచ్చిన అంశాలపై ఈడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. నాలుగు కోట్ల నగదు చేతులు మారిన అంశంపై అధికారులు దృష్టిసారించారు. ఈ క్రమంలో సుపారీ డబ్బుల మూలాలు, లావాదేవీలపై ఇటీవల ఎర్ర గంగిరెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే.
    ఇక, వివేకా హత్యకు సంబంధించి ఇప్పటికే ఏ2గా ఉన్న సునీల్ యాదవ్‌‌ను ఈడీ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా అధికారుల ఎదుట సునీల్ యాదవ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసులోని ఆర్థిక లావాదేవీలపై రహస్యాలను అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. సుపారీ ఒప్పందం, నిధులు సమకూర్చిన వ్యవహారమంతా అధికారుల ముందు బయటపెట్టినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ విషయాలు బయటకు వస్తే తనకు ప్రాణహానీ ఉందంటూ సునీల్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారని.. ఈ విషయాలను రహస్యంగా ఉంచుతామని ఈడీ అధికారులు అభయమిచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని ఇప్పటికే ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.