Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వికసిత భారత్ సైనికులు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు

    Author VENKATESH | 24 Sep 2026, 01:53 PM | కరీంనగర్
    వికసిత భారత్  సైనికులు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు

    యువతలో జాతీయ సమైక్యత
    యువజన వికాసం జాతీయత
    సమాజ సేవా తత్పరతను
    రగిలించే వేదిక ఎన్ ఎస్ ఎస్
    సేవయే లక్ష్యంగా చైతన్యమే
    ధ్యేయంగా మార్పుయే బాటగా
    గ్రామీణ శిబిరాల ఏర్పాటుతో
    గ్రామీణ జీవితం సమస్యల
    అధ్యయనమే కార్యక్షేత్రంగా
    మూఢవిశ్వాసాల నిర్మూలనకై
    కదులుతుంది ఎన్ ఎస్ ఎస్
    నా కోసం కాదు నీకోసం అంటూ
    చేసే సమాజ సేవా దేశప్రగతి
    కోసం సుస్థిరాభివృద్ధి కోసం
    మానవత పరివ్యాప్తి కోసం
    అనే నినాదాల అమలుకు
    అంకితమైన అభివృద్ధికి చోదక
    శక్తిగా ఎన్ ఎస్ ఎస్ నిలవడం
    అభినందనీయం
    రక్తదానం ఉచిత వైద్య శిబిరాలు
    పచ్చదనం పరిశుభ్రత అక్షరాస్యత
    పర్యావరణ రక్షణ ప్లాస్టిక్ రహిత
    సమాజం సుస్థిరాభివృద్ధి సాధనలో
    యువతను బాధ్యతా యుత
    పౌరులుగా తీర్చి దిద్దే కార్యాచరణ
    వేదిక ఎన్ ఎస్ ఎస్ పథకం
    ఎన్ ఎస్ ఎస్ యువతను
    వ్యసనాల నుండి విముక్తి
    కల్పించి యువత జీవితాలలో
    నూతన మార్పుకు వెలుగు రేఖ
    ఎన్ ఎస్ ఎస్
    శ్రమ విలువ డిజిటల్ సాక్షరత
    సైబర్ భద్రత మానసిక ఆరోగ్యం
    స్వచ్ఛభారత్ అంశాలపై
    సమాజంలో అవగాహన
    కల్పిస్తుంది
    ఎన్ ఎస్ ఎస్ లోఅన్ని వర్గాల
    విద్యార్థులు కలిసి పనిచేయడం
    వల్ల సహనం సమానత్వం టీం
    వర్క్ ద్వారా యువజన వికాసం
    జరిగి వికసిత్ భారత్ లక్ష్య
    సాధనకు ఎన్ఎస్ఎస్ బలమైన
    సైన్యంగా ఉపయోగపడుతుంది
    ఓయువతా స్వార్థం వీడి
    సమాజ శ్రేయస్సుకు
    కదిలిరండి.
    నేదునూరి కనకయ్య
    మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి
    (ఇందిరాగాంధీ నేషనల్
    ఎన్ 'ఎస్ 'ఎస్ బెస్ట్ యూనిట్
    అవార్డ్ గ్రహీత)అధ్యక్షులు
    తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం
    తెలంగాణ ఎకనామిక్ ఫోరం
    రచయిత' కాలమిస్ట్ కరీంనగర్
    9440245771