Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వరదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. జాగ్రత్తలు తీసుకోండి..

    Author VENKATESH | 24 Sep 2026, 01:06 PM | ANDHRA PRADESH
    వరదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. జాగ్రత్తలు తీసుకోండి..

    తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రత్తమైంది. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు, మంత్రులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నేడు, రేపు కూడా వర్షాలు కురవనున్నాయనే అంచనా ఉందని.. వివిధ జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే క్షేత్రస్థాయికి వెళ్లి చక్కదిద్దాలని సూచించారు.నీటి ఉధృతితో రోడ్లు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడిన చోట వెంటనే పునరుద్ధరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వర్షానికి కొండచరియలు విరిగిపడే చోట నివాసితులను అప్రమత్తం చేయాలని... అవసరమైతే తరలించాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం కనిపించకూడదన్నారు. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకోవాలని ఆదేశించారు. చెరువులు నింపడంపై దృష్టి సారించడంతో పాటు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.