Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రిమ్స్ ఆసుపత్రిలో శిశువుల మరణాలు ప్రభుత్వ హత్యలే

    Author VENKATESH | 23 Sep 2026, 03:22 PM | TELANGANA
    రిమ్స్ ఆసుపత్రిలో శిశువుల మరణాలు ప్రభుత్వ హత్యలే

    జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రి లో జరిగిన అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని బీఆర్‌ఎస్‌ మహిళా నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు బుధవారం సందర్శించారు. మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ , జోగు రామన్న ,ఎమ్మెల్యే అనిల్ జాదవ్ , ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, తుల ఉమా సందర్శించిన వారిలో ఉన్నారు.అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రిమ్స్ అగ్ని ప్రమాదంలో ఐదుగురు చిన్నారుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. చిన్నపిల్లలు చికిత్సలు పొందే ఎస్ఎంసీయులో కనీస సౌకర్యాలు లేవని, ఏసీల నిర్వహణను అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని విమర్శించారు. మరణించిన చిన్నారుల తల్లిదండ్రుల శాపనార్థాలు రేవంత్ రెడ్డికి తగులుతాయన్నారు.బీఆర్ఎస్ పాలనలో పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించామని , ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆసుపత్రిలో వైద్యులను నియమించడంతోపాటు మందులను సైతం అందుబాటులో నుంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. రిమ్స్ సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చేసింది ఏమీ లేదని అన్నారు. బాధిత కుటుంబాలకు ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు.