Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • శాప్ కార్యాలయంలో గురువులపై దాడి..

    Author VENKATESH | 22 Sep 2026, 12:27 PM | ANDHRA PRADESH
    శాప్ కార్యాలయంలో గురువులపై దాడి..

    విజయవాడ ఇందిరా స్టేడియంలోని ‘శాప్‌’ కార్యాలయం దగ్గర మెగా డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా టీచర్లపై కొంతమంది దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన వారిపై మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. సూర్యారావుపేటలో రెండు, మాచవరం పోలీస్ స్టేషన్‌లో రెండు, కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు హత్యాయత్నం, దాడులు, దౌర్జన్యాలు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు.ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణలో ఆటంకం కలిగించడం, విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేయడం వంటి నేరాల కింద కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసుల్లో వైసీపీ యువజన విభాగం నేత రవిచంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు, విజయవాడ, పల్నాడు జిల్లాల్లోని రౌడీ షీటర్లపై విజయవాడ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.