Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పోలీసుల‌మ‌ని బెదిరించి 17 ఏళ్ల బాలిక‌పై ముగ్గురి అఘాయిత్యం..!

    Author VENKATESH | 22 Sep 2026, 10:54 AM | NATIONAL
    పోలీసుల‌మ‌ని బెదిరించి 17 ఏళ్ల బాలిక‌పై ముగ్గురి అఘాయిత్యం..!

    దేశ రాజధాని ఢిల్లీ లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులమని బెదిరించి ముగ్గురు యువకులు ఓ 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దక్షిణ ఢిల్లీ లోని కల్కాజీ పరిధిలో ఉన్న ఒక పార్కులో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.వివరాల్లోకి వెళ్తే.. 17 ఏళ్ల బాధిత బాలిక తన స్నేహితుడితో కలిసి కల్కాజీ మందిరాన్ని సందర్శించింది. అనంతరం వారిద్దరూ సమీపంలోని పార్కులో కూర్చున్న సమయంలో పోలీసు దుస్తుల్లో ఉన్న ముగ్గురు యువకులు అక్కడికి చేరుకున్నారు. తాము పోలీసులమని బెదిరించి ప‌క్క‌కు తీసుకెళ్లారు. ఆపై బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు.ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.