Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి..

    Author VENKATESH | 17 Sep 2026, 12:48 PM | TELANGANA
    అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి..

    అమెరికాలో తెలంగాణ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పెళ్లైన 17 రోజులకే మృతిచెందడం సంచలనంగా మారింది. మసాచుసెట్స్‌లోని లోవెల్‌లో హైదరాబాద్‌కు చెందిన సివిల్ ఇంజినీర్ మహమ్మద్ జాబెర్ హుస్సేన్(28) నివసిస్తున్నాడు. సెప్టెంబర్ 14న కుటుంబ సభ్యులతో చివరిసారిగా అతను ఫోన్‌లో మాట్లాడాడు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే జాబెర్ తన గదిలో నిద్రలోనే మృతిచెందినట్లు అతని రూమ్‌మేట్ బాధిత కుటుంబానికి సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ కుటుంబంలో పెను విషాదం నెలకొంది.అయితే, జాబెర్ మృతికి గల కచ్చితమైన కారణాలపై స్పష్టత రాలేదు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాతే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ ఘటనపై స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, జాబెర్‌కు ఆగస్టు 28న టెక్సాస్‌లో వివాహం జరిగింది. అనంతరం అతను మసాచుసెట్స్‌కు తిరిగి వెళ్లాడు. జాబెర్ భార్య కూడా అతనితో కలిసి మసాచుసెట్స్‌కు వెళ్లిందా, లేదా? అనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. కొత్త జీవితాన్ని ప్రారంభించిన కొన్ని రోజులకే యువకుడు మృతిచెందడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. కాగా, మృతదేహాన్ని అమెరికా నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని జాబెర్ తండ్రి కోరారు.