Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యుత్ శాఖపై ఎల్‌నినో ఎఫెక్ట్..

    Author VENKATESH | 17 Sep 2026, 12:14 PM | ANDHRA PRADESH
    విద్యుత్ శాఖపై ఎల్‌నినో ఎఫెక్ట్..

    విద్యుత్ శాఖపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. వేసవిని తలపించే ఎండల వల్ల 50 మిలియన్ యూనిట్ల మేర అదనంగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయంలో 240 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా.. ఈసారి 290 మిలియన్ యూనిట్లకు చేరిందని అన్నారు. విద్యుత్ జనరేషన్ కంపెనీలన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని చెప్పారు. థర్మల్ పవర్ స్టేషన్లలో 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచామని తెలిపారు. కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినా అధిగమిస్తున్నామని అన్నారు. వర్షాలు లేకపోవడంతో హైడల్ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు.ప్రజలకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని మంత్రి తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 20 శాతం మేర విద్యుత్ డిమాండ్ పెరిగిందని మంత్రి అన్నారు. డిమాండ్‌ను బట్టి బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఎల్‌నినో ప్రభావం అన్ని రాష్ట్రాల్లో ఉందని.. ఆ రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని చెప్పుకొచ్చారు.