Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి..

    Author VENKATESH | 16 Sep 2026, 08:09 PM | ANDHRA PRADESH
    రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి..

    రాష్ట్రంలోని అన్ని రంగాలు, అన్ని వర్గాలను బలోపేతం చేసేలా బ్యాంకులు విస్తృతంగా రుణాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. 236వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో బ్యాంకర్లు, అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. రుణాల లక్ష్యాలను చేరుకున్నప్పుడే ఎస్‌ఎల్‌బీసీ సమావేశాల నిర్వహణకు సార్థకత ఉంటుందని పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈలకు గతంతో పోలిస్తే ఈసారి రుణాల మొత్తం పెరిగినప్పటికీ.. ఆశించిన స్థాయిలో రుణాల మంజూరు జరగలేదని చంద్రబాబు అన్నారు. కొన్ని బ్యాంకులు రుణాల మంజూరులో చాలా వెనుకబడి ఉన్నాయని పేర్కొంటూ.. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చంద్రబాబు తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకులు పెద్దఎత్తున రుణాలు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో 15 శాతం ఆర్థిక వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఎల్‌నినో కారణంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.