Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • యూపీఐ ఛార్జీలు పెంచిన వేళ..

    Author VENKATESH | 16 Sep 2026, 02:10 PM | BUSINESS
    యూపీఐ ఛార్జీలు పెంచిన వేళ..

    ఈ పరిణామాల మధ్య కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ పన్ను వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు సంస్కరణలను తీసుకువచ్చే దిశగా చర్యలు తీసుకుని రావాల్సిన అవసరం ఉందని అన్నారు. పన్ను నిబంధనలలో మార్పుల కోసం వ్యక్తిగత ప్రయోజనాల ఆధారంగా కాకుండా వ్యవస్థకు ఉపయోగపడే రీతిలో విశ్లేషణాత్మక ప్రతిపాదనలతో ముందుకు రావాలని సూచించారు. బెంగళూరులో ఇంటర్నేషనల్ ట్యాక్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఫౌండేషన్ 8వ అంతర్జాతీయ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని నిబంధనల వల్ల కొందరు పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలుగుతోందని అన్నారు. అయినప్పటికీ.. ఈ నిబంధనలు పన్ను వ్యవస్థ సమర్థతను దెబ్బతీసేలా ఉంటే వాటిని తొలగించాలనే గళాన్ని వినిపించే వాళ్లు ఇప్పుడు అవసరం అయ్యారని వ్యాఖ్యానించారు. రైల్వేలు, పెట్రోల్ బంకుల్లో UPI న్యూ రూల్స్.. పరిమితి దాటితే సైలెంట్ గా బాదుడే దేశ ఆర్థిక వ్యవస్థకు, పన్నుల వసూళ్ల రంగానికి దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూర్చే అంశాలపైనే ప్రతి ఒక్కరూ ప్రధానంగా దృష్టి సారించాలని నిర్మల సీతారామన్ చెప్పారు. పన్ను నిబంధనల సవరణలపై ప్రతిపాదనలు చేసేటప్పుడు పూర్తి సమాచారంతో కూడిన నివేదికలను సమర్పించాలని కోరారు. ఏదైనా నిబంధన వల్ల పన్ను చెల్లింపుదారులపై అదనపు భారం పడుతుంటే, దాని వల్ల ఎంతమంది ప్రభావితమవుతున్నారు, ఎంత సమయం, వ్యయం వృథా అవుతుందనే వివరాలను గణాంకాలతో సహా నిరూపించాలని కోరారు. ఛార్జెస్ రూ.5,000 లకు 25, రూ. 10,000 లకు 50: మండిపడ్డ కాంగ్రెస్ దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటో కూడా ప్రతిపాదించాలని, ఈ మార్పుల వల్ల ప్రభుత్వ ఆదాయంపై పడే ప్రభావాన్ని నిశితంగా అంచనా వేయాలని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. వీటి వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది, పన్ను పరిధి ఏ మేరకు ప్రభావితమవుతుంది, పన్నుల నిర్వహణపై ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని సమగ్రంగా విశ్లేషించడం ఎంతైనా అవసరమని వివరించారు.