Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అసెంబ్లీలో మాట్లాడనివ్వకపోతే రాజీనామా చేస్తా

    Author VENKATESH | 16 Sep 2026, 11:15 AM | TELANGANA
    అసెంబ్లీలో మాట్లాడనివ్వకపోతే రాజీనామా చేస్తా

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు (బుధవారం) ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ అభివృద్ధి విషయం గురించి సభలో మాట్లాడనివ్వకపోతే రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. నిజామాబాద్ ఎవరికి పట్టని జిల్లా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రుల జిల్లాలకు ఎక్కువ నిధులు తీసుకువెళ్తున్నారని.. అవసరమైతే ఈ రోజు రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు. చాలా ఏళ్లుగా ఆర్మూర్‌లో రెవెన్యూ కార్యాలయం కట్టాలని కోరుతున్నానని.. అయినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
    దివ్యాంగుల హామీలను నెరవేర్చాలి: పాయల్ శంకర్
    ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన దివ్యాంగుల హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.ఈరోజు (బుధవారం) హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీల్లో భాగంగా దివ్యాంగులకు ఇచ్చిన పెన్షన్ హామీ రూ. 6016లకు పెంచాలని పట్టుబట్టారు. దివ్యాంగులు కోటాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని అడిగారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులు మెట్రో రైల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని కోరారు.