Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కన్వీనర్‌ కోటా సెకండ్‌ ఫేజ్‌ సీట్ల కేటాయింపు వివరాలు విడుద‌ల‌..

    Author VENKATESH | 15 Sep 2026, 08:44 PM | TELANGANA
     కన్వీనర్‌ కోటా సెకండ్‌ ఫేజ్‌ సీట్ల కేటాయింపు వివరాలు విడుద‌ల‌..

    2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా కన్వీనర్‌ కోటా సెకండ్‌ ఫేజ్‌ సీట్ల కేటాయింపు వివరాలను కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (KNRUHS) మంగళవారం విడుదల చేసింది. కాలేజీల వారీగా సీట్ల కేటాయింపు వివరాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

    కన్వీనర్‌ కోటా సెకండ్‌ ఫేజ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్‌ 19వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు సంబంధిత మెడికల్‌ కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది. విద్యార్థులు కాలేజీల్లో చేరే సమయంలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, అవసరమైన బాండ్లు, ఇతర ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుందని KNRUHS వెల్లడించింది.

    మేనేజ్‌మెంట్‌ కోటా ఫస్ట్‌ ఫేజ్‌ సీట్ల కేటాయింపు..
    ఇదే సమయంలో మేనేజ్‌మెంట్‌ కోటా కింద ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులకు సంబంధించిన ఫస్ట్‌ ఫేజ్‌ సీట్ల కేటాయింపు వివరాలను కూడా యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ కేటగిరీలో సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్‌ 19వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు తమకు కేటాయించిన కాలేజీల్లో చేరాలని సూచించింది. అడ్మిషన్‌ సమయంలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, బాండ్లు, ఇతర అవసరమైన పత్రాలను సమర్పించి ప్రవేశాలను పూర్తి చేసుకోవాలని తెలిపింది.

    ఇవి కూడా చదవండి