Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఏపీలో ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం అనుమతి.. జీఓ జారీ

    Author VENKATESH | 15 Sep 2026, 08:24 PM | ANDHRA PRADESH
    ఏపీలో ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం అనుమతి.. జీఓ జారీ

    రాష్ట్రంలో ఫ్రీ హోల్డ్ హక్కులు పొందిన 7,85,500 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అసైన్డ్ భూములుగా తప్పుగా నమోదు చేసిన.. 5,422 ఎకరాల ప్రైవేట్ పట్టా భూములకు ఆంక్షలు లేకుండా రిజిస్ట్రేషన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరుకు ఫ్రీ హోల్డ్ భూములపై కూటమి సర్కార్ మంగళవారం జీఓ జారీ చేసింది. ఫ్రీ హోల్డ్‌కు అర్హత ఉండి ప్రొసిడింగ్స్ కాని.. 64,143 ఎకరాల భూములకు ఉత్తర్వులు లేకుండానే రిజిస్ట్రేషన్‌కు వెసులుబాటు కల్పించింది. చుక్కల భూముల చట్టం-2017 కిందకు వచ్చే 17,897 ఎకరాల భూములకు రిజిస్ట్రేషన్ల నిర్వహణకు పచ్చ జెండా ఊపింది.అసైన్‌మెంట్ జరిగి 20 ఏళ్లు నిండని 28,292 ఎకరాలకు.. సంబంధించి గడువు పూర్తయ్యాకే రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి ఫ్రీ హోల్డ్ చేసిన 38,733 ఎకరాలు, లబ్ధిదారుల స్వాధీనంలో లేని 25,486 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. ఉల్లంఘనలు, స్వాధీనం చేయని భూములపై.. ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్లతో సమగ్ర విచారణ చేయాలని ఆదేశించింది. వెబ్‌లాండ్‌లో అసైన్డ్‌గా ఉండి అదనపు ఆధారాలు లేని 2,87,53 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లు పరిశీలన కోసం హోల్డ్‌‌లో ఉంచింది.