Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అధిష్టానం నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి

    Author VENKATESH | 13 Sep 2026, 03:46 PM | వరంగల్
    అధిష్టానం నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి

    వరంగల్ పార్టీ ముఖ్యనేతలతో మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు సమావేశమయ్యారు. అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. నన్ను బర్త్ రఫ్ చేసినప్పుడు కార్యకర్తలు ఆవేశంతో రగిలి పోయారు. వారిని శాంతంగా ఉండాలని కోరాం.. పదవులు వస్తాయి..పోతాయి.. ప్రస్తుతం అవకాశవాద రాజకీయాలు ఎక్కువయ్యాయన్నారు.కొండా సురేఖకు ఉమ్మడి రాష్ట్రంలో ఒక పేరు ఉంది. మా వెనుక గుంట నక్కలు ఉన్నాయి. మంత్రి సారయ్యను ఓడించాలనే అప్పుడు తూర్పులో కేసీఆర్ పోటీ చేయాలని సూచించారు. మంత్రిని ఓడించాను.. ఒక జెండాపై గెలిచి… మరో జెండా కిందికి రాలేదని విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామన్నారు. కొండా మురళి రికమెండ్ చేస్తూ సంతకం చేస్తేనే సుధారాణికి పదవి వచ్చింది.. పదవి వచ్చిన తర్వాత ఆమె కనీసం ఫోన్ కూడా చేయలేదన్నారు.