Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • "ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్..!" కేంద్రమంత్రి అరుదైన ప్రశంస..!

    Author VENKATESH | 12 Sep 2026, 08:31 PM | ANDHRA PRADESH
    "ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్..!" కేంద్రమంత్రి అరుదైన ప్రశంస..!

    విజయవాడలో వైద్యారోగ్య శాఖకు చెందిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్న కేంద్రమంత్రి నడ్డా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సంజీవని కార్యక్రమంపైనా ప్రశంసలు కురిపించారు. దీన్ని జాతీయ స్థాయిలో అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ప్రజలకు ముందస్తుగా వ్యాధులను గుర్తించడం, నివారణ, మెరుగైన చికిత్సతో పాటు అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కేంద్రం నుంచి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.సీఎం చంద్రబాబు సారథ్యంలో ఏపీ సురక్షితమైన చేతుల్లో ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. చంద్రబాబు విజన్‌, నిబద్ధత కలిగిన నాయకుడని ప్రశంసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, విభజిత ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో చంద్రబాబు పోషించిన పాత్రను మరువలేమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు చేస్తున్న కృషిని కొనియాడారు. వైద్యారోగ్య రంగానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని నడ్డా తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేపడుతున్న చర్యలను ప్రశంసించారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన వంటిల్లే ఫార్మసీ-ఆహారమే ఔషధం అనే విషయాన్ని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తన ప్రసంగంలో వివిధ సందర్భాల్లో ప్రస్తావించారు. చంద్రబాబు చెప్పిన మాటలు నూటికి నూరు శాతం నిజమన్నారు.