Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కరెంట్ కోతలపై రైతుల కన్నెర్ర.. సబ్‌స్టేషన్‌ ముట్టడి..

    Author VENKATESH | 12 Sep 2026, 11:51 AM | TELANGANA
    కరెంట్ కోతలపై రైతుల కన్నెర్ర.. సబ్‌స్టేషన్‌ ముట్టడి..

    పంటలకు అవసరమైన సమయంలో విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రకటిత విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోతున్నాయంటూ సూర్యాపేట మండల పరిధిలోని యర్కారం సబ్‌స్టేషన్‌ను రైతులు ముట్టడించారు. అనంతరం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది.విద్యుత్‌ కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో రైతులు యర్కారం సబ్‌స్టేషన్‌ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. వారి ఆందోళనకు బీఆర్‌ఎస్‌ నాయకుడు, సూర్యాపేట మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కంట తడి పెట్టించేందుకే అప్రకటిత కరెంటు కోతలను విధిస్తుందని అన్నారు. రైతులు ధాన్యం పండిస్తే ఎక్కడ కొనాల్సి వస్తుందో అని నీళ్లు ఇవ్వకుండా కనీసం బోరుబావుల కింద ఉన్న పంట సాగు చేసుకుందామంటే కరెంటు ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేస్తుందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల పాటు రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు, సాగునీరు ఇచ్చిందని ఈ ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు.