Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నేదునూరి పిలుపు

    Author VENKATESH | 11 Sep 2026, 04:58 PM | కరీంనగర్
    నేదునూరి పిలుపు

    "జీవన రాగం"
    నిర్లక్ష్యపు లోకంలో
    నిండైన ప్రశాంతత
    మనిషి మనీ మాయలో పడి
    తోటి మనిషిని మరి చాడు
    స్వార్ధపు రంగులేసుకొని
    బంధాలను మరిచాడు
    నటనల లోకంలో నిజాయితీకి
    తావులేదు నమ్మకం మార్కెట్లో
    అమ్మకమైంది
    ఆర్థిక బంధాలే సమాజాన్ని
    శాసిస్తున్నాయి
    కరిగిపోయే విలువల ముందు
    కన్నీటికి విలువ లేదు
    కలిసి ఉండే కుటుంబాలు
    కనుమరుగై పోతుంటే
    సుఖ దుఃఖాలు పంచుకునే
    స్నేహానికి అర్ధం మారి
    స్వార్ధపు అవసరాలకైహద్దులు
    దాటుతూ వంచనల వలలో
    చిక్కుకొని ఇల్లుగుల్ల చేసుకునే
    సంఘటనలు సమాజానికి
    సవాలుగా నిలిచాయి
    కాలాన్ని వృథా చేస్తూ డ్రగ్స్
    మత్తు గుప్పిట్లో యువత
    దారి తప్పి హత్యలకు
    ఆత్మహత్యలకు పాల్పడే
    దుష్ట సంస్కృతి పెట్ట్రేగిపోతుంది
    నైతిక విలువలు సామాజిక
    కట్టుబాట్లు పూర్తిగా మరిచిపోయి
    ఇంటిని దిద్దే మహిళా లోకం
    ఓర్పును కోల్పోతుంది
    సహజీవనం పేరున పవిత్రమైన
    భార్యాభర్తల వ్యవస్థ అపనమ్మకం
    వ్యక్తిగత విలాసాల విషయంలో
    చిక్కుకొని ఒకరికి ఒకరు రక్షణగా
    ఉండాల్సిన భార్యాభర్తలు
    హత్యలకు ఆత్మహత్యలకు
    పాల్పడి తమ సంతానాన్ని
    హతమార్చడం అనాదాలుగా
    మార్చే ప్రమాధకర ధోరణులు
    సమాజంలో ప్రభలడం శోచనీయం
    ఆధునికత పేరున నాగరికత
    మోజులో మానవులు
    బాధ్యతలను మరుస్తున్నారు
    బంధాలను వీడుతున్నారు
    అహంకారం ఆధిపత్య వాదం
    రాజ్యమేలి పెళ్లి చేసుకున్న
    జంటలు ఘర్షణ పడి
    విడిపోతున్నాయి
    జీవితాంతం ఒకరికి ఒకరు తోడు
    నీడగా ఉంటామని ప్రమాణం
    చేసిన వధూవరులు మరుక్షణమే
    నీకు నువ్వే నాకు నేనే
    ఎవరికి వారే యమునా తీరే
    అనే నయా జీవితాన్ని
    కోరుకోవడం సామాజిక
    సమస్యగా పరిణమించింది
    నీవు ఉంటే ఒక లాగా లేకుంటే
    మరో లాగా మాట్లాడే మనుషులకై
    ఆరాటం ఎందుకు?
    అవసరానికి వాడుకునే
    నకిలి బంధాల కోసం
    ఆత్మగౌరవాన్ని వీడి
    ఆరాటపడడం ఎందుకు?
    పలకరించని పెదవుల
    కోసంపదే పదే వెతుకకు
    పట్టించుకోని మనుషుల
    కోసం ప్రాధేయపడకు
    మిమ్మల్ని కోల్పోవడానికి సిద్ధంగా
    ఉన్న వారి వెనుక పడటం ఆపేసిన
    మరుక్షణంలోనే మీ జీవితం
    ప్రశాంతంగా మారుతుంది
    మొదట్లో కొంత ఒంటరి తనం
    అనిపించినప్పటికీ మిమ్మల్ని
    పట్టించుకోమని ఇతరులను
    బతిమాలడం కోసం వృధాచేసిన
    శక్తి క్రమంగా మీకే అర్థమౌతుంది
    ఎవరో నిన్ను గుర్తించాలని
    నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు
    ఆత్మన్యూనతను విడనాడు
    ఆత్మగౌరవంతో బతుకు
    ఎదుటి వారి నిర్లక్ష్యానికి
    నీ ప్రశాంతతను బలిచేయకు
    మారుతున్న సమాజంలో
    నీకంటూ ఒక లోకముంది
    ప్రేమించే నీ హృదయానికి
    అర్ధం పరమార్ధం ఇంకొకటి
    ఉంటుంది
    ఈ జీవితాన్ని మళ్ళీ
    జీవించడానికి ఇంకో
    అవకాశం రాదు
    ఉన్నది ఒక్క జీవితమే
    మనస్పూర్తిగా ప్రేమించండి
    నచ్చినట్లు జీవించండి
    మీ జీవితాన్ని మీకు కావలసిన
    రీతిలో మలచుకుంటూ శక్తి
    వంచన లేకుండా శ్రమించండి
    విజయాల సంతోషాన్ని
    మీ కళ్ళముందే ఆస్వాదించండి

    నిన్ను కాదన్న వారిని వదిలేసి
    ముందుకు సాగిపో నిజమైన
    సంతోషాన్ని నీలోనే వెతుక్కో
    నీ జీవితానికి నీవే రాజువు
    అలల లాంటి ఆలోచనలను
    అదుపులో ఉంచుకో
    అందమైన జీవితాన్ని
    ప్రశాంతంగా గడుపుకో
    నిన్ను నీవు తక్కువ అంచనా
    వేసుకోవడమే ప్రపంచంలో
    అన్నిటి కంటే పెద్ద పాపం.
    నీ ప్రశాంతకు నీగౌరవానికి
    నువ్వె బాధ్యుడివి.
    నిన్ను గుర్తించని
    సమాజం కోసం
    కాకుండా నీలోని
    దైవత్వాన్ని మేల్కొలిపి
    ధైర్యంగా
    ముందుకు సాగిపో.
    స్వామి వివేకానంద
    స్వామి వివేకానంద
    వ్యాఖ్యను స్పూర్తిగా తీసుకొని
    పట్టించుకొని వారి కోసం
    పాకులాడక జీవితంలో
    ప్రశాంతతకై సాగిపోవాలి
    నేదునూరి కనకయ్య
    రచయిత కాలమిస్ట్
    అధ్యక్షులు
    తెలంగాణ ఎకనామిక్ ఫోరం కరీంనగర్ 9440245771