Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పొలిటికల్ ఫ్యూచర్‌పై కొండా సురేఖ దంపతుల మౌనం

    Author VENKATESH | 10 Sep 2026, 04:34 PM | TELANGANA
    పొలిటికల్ ఫ్యూచర్‌పై కొండా సురేఖ దంపతుల మౌనం

    క్యాడర్లో సురేఖ పొలిటికల్ ఫ్యూచర్ పైన ఆందోళన కొనసాగుతున్న వేళ కొండా సురేఖ దంపతులు మౌనం వహించారు. ప్రస్తుతం కొండా కపుల్ అజ్ఞాతంలో ఉన్నారు. ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రులు ముగిసే వరకు కొండా దంపతులు అజ్ఞాతంలో ఉంటారు. ఇది చాలాకాలంగా కొండా ఫ్యామిలీకి ఉన్న ఆనవాయితీ. వినాయక చవితి నవరాత్రులను తమకు సంబంధించిన ఏ పనులు చేయటానికి, ఎవరితోనూ మాట్లాడటానికి కొండా దంపతులు ఆసక్తి చూపించరు. వీరికి ప్రతీ సంవత్సరం ఇదొక సెంటిమెంట్. దీంతో ప్రస్తుతం ఆమె పొలిటికల్ గా ముందుకు వెళ్ళే ఎలాంటి ప్లాన్ పై దృష్టి పెట్టటం లేదు. ఎవరితోనూ చర్చలు జరపటం లేదు. సైలెంట్ గా అజ్ఞాతంలో ఉండిపోయారు. మంత్రి పదవి నుండి బర్తరఫ్ తర్వాత రీసెంట్ గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కొండా సురేఖ ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళారు. దీంతో వరంగల్ తూర్పులో, జిల్లాలో కొండా వర్గం ఆందోళనలో ఉంది. ఆమె పొలిటికల్ ఫ్యూచర్ కు సంబంధించి ఏం చేయబోతున్నారు అన్న చర్చ సాగుతుంది. కొండా దంపతులు ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పట్లో తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. వినాయక నవరాత్రులు ముగిసే దాకా అజ్ఞాతంలో ఉండే ఈ కపుల్ వినాయక నవరాత్రుల తర్వాతే తమ రాజకీయ ప్రస్తానంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

    l