Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • శాసన మండలి నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్

    Author VENKATESH | 10 Sep 2026, 01:36 PM | TELANGANA
    శాసన మండలి నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్

    తెలంగాణ శాసనమండలి నుంచి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. గురువారం మండలి ప్రారంభమైన తర్వాత 22ఎపై చర్చించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. అందుకోసం వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను శాసనమండలి చైర్మన్ తిరస్కరించారు.దాంతో బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చైర్మన్ పోడియం వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పేపర్లు చించి గాలిలోకి ఎగరేశారు. అనంతరం మండలి నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్ సభ్యులు బయటకు వెళ్లిపోయారు.