Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రాజకీయాల నుంచి త‌ప్పుకున్న సీనియ‌ర్ నేత‌..!

    Author VENKATESH | 10 Sep 2026, 11:29 AM | NATIONAL
    రాజకీయాల నుంచి త‌ప్పుకున్న సీనియ‌ర్ నేత‌..!

    బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఆదేశాలతో ఆ పార్టీ బహిష్కృత నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు అశోక్ సిద్ధార్థ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తన అల్లుడు, మాయావతి మేనల్లుడు అయిన ఆకాశ్ ఆనంద్‌కు పార్టీలో మళ్లీ అవకాశం ఇవ్వాలంటే సిద్ధార్థ్ రాజకీయ సన్యాసం తీసుకోవాలని మాయావతి షరతు పెట్టిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.గురువారం సోషల్ మీడియా వేదికగా అశోక్ సిద్ధార్థ్ ఒక సుదీర్ఘ పోస్ట్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆగస్టు 2న రెండోసారి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన, తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. మాయావతిని తన “రాజకీయ గురువు, అక్క” అని సంబోధిస్తూ.. బీఎస్పీకి తన విధేయతను పునరుద్ఘాటించారు. “ప్రపంచంలో మరేదానికన్నా మీ ఆదేశమే నాకు ముఖ్యం. మీ ఆజ్ఞల ముందు నా వ్యక్తిగత సంబంధాలు, కుటుంబం కూడా చిన్నవే” అని ఆయన పేర్కొన్నారు.గత 35 ఏళ్లుగా బీఎస్పీకి అంకితభావంతో పనిచేస్తున్నానని సిద్ధార్థ్ తెలిపారు. “సాధారణ కార్యకర్తనైన నాకు ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. మీ కుటుంబంలో ఒకడిగా నన్ను భావించారు. ఈ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది. గౌతమ బుద్ధుడు, కాన్షీరాం సాక్షిగా చెబుతున్నా పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా తాను ఎన్నడూ పనిచేయలేదని ఆయన స్పష్టంచేశారు. ఆకాశ్ ఆనంద్‌ను తప్పుదోవ పట్టించారని, పార్టీని నియంత్రణలోకి తీసుకునేందుకు ప్రయత్నించారని తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు.“గత కొన్ని నెలల్లో నేను ఆకాశ్ ఆనంద్‌ను కలిసింది చాలా తక్కువసార్లు. అది కూడా ఎన్నికల రాష్ట్రాల్లో మీరు నాకు అప్పగించిన బాధ్యతల నేపథ్యంలోనే. సంస్థలో నాకు లభించిన గౌరవాన్ని చూసి అసూయపడిన కొందరు సహచరులే నాపై కుట్ర చేసి తప్పుడు ఆరోపణలు చేశారు” అని సిద్ధార్థ్ ఆవేదన వ్యక్తంచేశారు. తన రిటైర్మెంట్‌ను కేవలం ఆకాశ్ ఆనంద్ పునరాగమనంతో ముడిపెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. “బహుజన ఉద్యమానికి నా రాజకీయ జీవితం అడ్డంకిగా ఉందని మీరు భావిస్తే, ఈ క్షణం నుంచే నేను రాజకీయ, సామాజిక జీవితం నుంచి విరమించుకుంటున్నా అని” అని పేర్కొన్నారు.