Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యార్థుల భవిష్యత్‌ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర

    Author VENKATESH | 05 Sep 2026, 01:31 PM | TELANGANA
    విద్యార్థుల భవిష్యత్‌ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర

    విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని దస్తగిరిపల్లె సర్పంచి పులి రమేష్‌ అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దస్తగిరిపల్లె మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచి పులి రమేష్‌, గ్రామ కార్యదర్శి శ్రావణ్‌ పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందిస్తున్న ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమని రమేష్‌ పేర్కొన్నారు.
    ఉపాధ్యాయుల సేవలను గుర్తించి వారిని సన్మానించడం సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు. విద్యార్థులలో విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వేణుకుమార్‌, కృష్ణకిషోర్‌, అంగన్‌వాడీ టీచర్‌ సుమలత, ఆయా ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.