Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భారీ వర్షాలు.. మోకాళ్ల లోతు నీరు.. అయినా ఆగని పెళ్లి వేడుక

    Author VENKATESH | 05 Sep 2026, 01:21 PM | NATIONAL
    భారీ వర్షాలు.. మోకాళ్ల లోతు నీరు.. అయినా ఆగని పెళ్లి వేడుక

    ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయి. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరింది. అయినా గలాంగ్–గిల్బర్ట్ జంట మాత్రం తమ పెళ్లిని వాయిదా వేసుకునేందుకు అంగీకరించలేదు. అనుకున్న ముహూర్తానికే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వరద నీటిలోనే పెళ్లి దుస్తులు ధరించి కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక్కటయ్యారు. నీటిలో నిలబడే వివాహ వేడుకను నిర్వహించారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా.. తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజును వాయిదా వేయకుండా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వరద నీటిలోనే పెళ్లి చేసుకున్న జంటను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తమ ప్రేమను, పెళ్లి నిర్ణయాన్ని మార్చుకోని ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు.