Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తీసేయాల్సిందే

    Author VENKATESH | 05 Sep 2026, 12:26 PM | TELANGANA
    ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తీసేయాల్సిందే

    పటాన్‌చెరు నియోజకవర్గంలోని సింఫనీ పార్క్ హోమ్స్ కాలనీలో 22ఏ పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. సింఫనీ పార్క్ హోమ్స్‌కు సంబంధించిన 15వందల ఇళ్లను నిషేధిత జాబితాలో పెట్టడంపై కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. పఠాన్‌చెరులో 55 ఎకరాల్లో ప్రభుత్వ శాఖల అనుమతులతో సింఫనీ హోమ్స్ నిర్మాణం జరిగిందని ఎంపీ తెలిపారు.రూపాయి రూపాయి కూడబెట్టి, లోన్లు తీసుకుని నిర్మించుకున్న ఇళ్లను రాత్రికి రాత్రి 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చడం బాధాకరమన్నారు. 12 ఏళ్ల క్రితం నిర్మాణం జరిగిన కాలనీని ఎలా నిషేధిత జాబితాలో చేరుస్తారని ప్రశ్నించారు. ఎవరు దరఖాస్తు చేశారని 22 ఏ జాబితా నుంచి రేవంత్ రెడ్డి ఇల్లు తొలగించారని నిలదీశారు.