Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దుర్గం చెరువు దుస్థితిపై కేటీఆర్‌ ఫైర్‌..

    Author VENKATESH | 05 Sep 2026, 11:38 AM | హైదరాబాద్
     దుర్గం చెరువు దుస్థితిపై కేటీఆర్‌ ఫైర్‌..

    హైదరాబాద్ బ్రాండ్‌గా నిలిచిన దుర్గం చెరువు పరిస్థితి అధ్వానంగా మారడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంటూ బిజీగా ఉందని.. ప్రస్తుత సిటీని కాలుష్యం, ఇతర సమస్యల నుంచి కాపాడటంపై దృష్టి పెట్టేందుకు సమయం లేదని ఎద్దేవా చేశారు. ప్రజెంట్ సిటీ ఇప్పుడు సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉందని తెలిపారు.దుర్గం చెరువు ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన వీడియోను ‘ఇండియన్‌ టెక్‌ అండ్‌ ఇన్‌ఫ్రా’ ఎక్స్‌ ఖాతా ద్వారా చేసిన పోస్టును కేటీఆర్‌ షేర్‌ చేశారు. చెరువు నీటి ఉపరితలంపై భారీగా చెత్త పేరుకుపోయిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. చెరువు పరిసరాలు కూడా చెత్తాచెదారంతో నిండిపోయినట్లు పోస్టులో పేర్కొన్నారు.