Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు డిన్నర్ మీట్..

    Author VENKATESH | 03 Sep 2026, 08:41 PM | ANDHRA PRADESH
    స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు డిన్నర్ మీట్..

    ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని సీఎం నివాసంలో మంత్రులు, పరిశీలకులు, రీజినల్ కో-ఆర్డినేటర్లు, సీనియర్ ఎమ్మెల్యేలతో ఆయన డిన్నర్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులతో ప్రత్యేకంగా చర్చించారు.ఎన్నికల వ్యూహం, సమన్వయంపై సీఎం చంద్రబాబు సుదీర్ఘ చర్చలు జరిపారు. మిత్రపక్షాలతో సమన్వయంపైనా కూలంకషంగా మాట్లాడారు. స్థానిక సంస్థల ఫార్ములాతో పాటు వ్యూహంపై మంత్రులతో సమాలోచనలు చేశారు. అక్టోబర్‌లో ఎన్నికలు కచ్చితంగా ప్రారంభమవుతాయని పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని స్పష్టం చేశారు. పరిశీలకులు వెంటనే జిల్లాలకు వెళ్లాలని.. అందరూ సిద్ధం కావాలని సమావేశంలో పాల్గొన్న వారికి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.