Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నేదునూరి పిలుపు పరిహాసం దాటి ప్రగతి వైపు

    Author VENKATESH | 01 Sep 2026, 08:32 PM | కరీంనగర్
    నేదునూరి పిలుపు  పరిహాసం దాటి   ప్రగతి వైపు

    ఓ మనిషి నీ విజయాలను
    ఓర్వలేని వారు కొందరు
    నీప్రతి కదలికను ప్రతి
    అడుగును తప్పు పట్టే
    కుటిలురు కొందరు
    నీ గుండెల్లో గాయాన్ని చూడక
    పరిహాసించే నిర్ధయులు కొందరు
    నీ ప్రతిభను గుర్తించక
    అపహాస్యం చేసే అజ్ఞానులు
    ఎగతాళి చేసేవారితో
    సంబంధాలు తెంచుకో
    నీ ఆత్మగౌరవాన్ని
    కాపాడుకుంటూ ముందుకు సాగిపో
    నీ కన్నీటిని తుడిచే కరుణ
    ఉన్న హృదయాలను వెతుక్కో
    నీ మౌనంలో ఉన్న బాధను గ్రహించే మనుషులను ఆశ్రయించు
    నీ కష్టాల కడలిలో తోడుగా నిలిచే వాళ్ళే నిజమైన బంధువులు
    నీ గెలుపును చూసి నీకంటే మిన్నగా మురిసిపోయే వారే
    నీ హితులు ఆదరించే వారితో
    ఆత్మీయత పెంచుకో
    లోకుల విమర్శలు నీ ప్రయాణాన్ని
    అడ్డుకునే శక్తి కాకూడదు
    అవి నీవు ఉన్నత శిఖరాలు
    అధిరోహించడానికి తోడ్పడే
    సోపానాలు కావాలి
    నిన్ను తక్కువ చేసే మనుషుల
    నీడను సైతం వదిలేయ్
    నిన్ను గౌరవించే సజ్జనుల
    సాంగత్యంలో సామ్రాజ్యాన్ని
    నిర్మించుకో
    ఎవరికోసమో నీకు నువ్వు
    తగ్గించుకోకు
    నీవ్యక్తిత్వాన్ని వదులుకోకు
    ధైర్య సాహసాలతో అడుగు
    ముందుకెయ్యి
    సంకల్పం పట్టుదల ఆత్మవిశ్వాసం
    నిన్నువిజయ తీరాలకు చేరుస్తుంది
    నేదునూరి కనకయ్య
    రచయిత కాలమిస్ట్
    కరీంనగర్
    9440245771