Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ‘మారెమ్మ’ ట్రైలర్ రిలీజ్..

    Author VENKATESH | 01 Sep 2026, 02:12 PM | Cinema
    ‘మారెమ్మ’ ట్రైలర్ రిలీజ్..

    మాస్ మహారాజ రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు ప్రధాన పాత్రలో తెరకెక్కిన విలేజ్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన టీజర్‌తో సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్రబృందం.. ఇప్పుడు ట్రైలర్ ద్వారా కథకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర అంశాలను ప్రేక్షకులకు పరిచయం చేసింది. గ్రామీణ నేపథ్యం, దైవ విశ్వాసాలు, మూఢనమ్మకాలు, యాక్షన్ అంశాలను మేళవిస్తూ ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కథ విషయానికి వస్తే.. ఓ సంక్షోభంలో చిక్కుకున్న గ్రామస్తులు తమ గ్రామ దేవత మరెమ్మ తల్లిపై నమ్మకం పెట్టుకుంటారు. అయితే అమ్మవారికి సంబంధించిన పవిత్రమైన ఎద్దు అనూహ్యంగా కనిపించకుండా పోవడంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు మొదలవుతాయి. ఆ ఎద్దు అదృశ్యం కావడం వెనుక ఏదో పెద్ద కారణం ఉందని గ్రామస్తులు భావిస్తారు. ఈ పరిణామాల నేపథ్యంలో యువ కథానాయకుడిపై ఆ ఎద్దును వెతికి తీసుకురావాల్సిన బాధ్యత పడుతుంది.ఎద్దు కోసం అతడు చేసే అన్వేషణ క్రమంలో ఎన్నో ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. గ్రామంలో పాతుకుపోయిన నమ్మకాలు, స్థానిక రాజకీయాలు, ఆధిపత్య పోరాటాలు అతడి ప్రయాణాన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. ఈ క్రమంలో హీరో పలు హింసాత్మక సంఘర్షణల్లో చిక్కుకున్నట్లు ట్రైలర్‌లో చూపించారు.అయితే ‘మారెమ్మమ్మ’ కథలో అసలు మిస్టరీ ఏమిటన్నది మాత్రం ట్రైలర్‌లో పూర్తిగా రివీల్ చేయలేదు. పవిత్రమైన ఎద్దు ఎందుకు కనిపించకుండా పోయింది? దాని వెనుక ఎవరి హస్తం ఉంది? హీరో ఎదుర్కొనే సమస్యలకు, గ్రామ దేవత నమ్మకాలకు ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలను అలాగే ఉంచుతూ ట్రైలర్‌ను ఆసక్తికరంగా కట్ చేశారు