Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సచివాలయం వద్ద సెక్రటేరియట్ ఉద్యోగుల ఆందోళన..

    Author VENKATESH | 01 Sep 2026, 01:54 PM | హైదరాబాద్
    సచివాలయం వద్ద సెక్రటేరియట్ ఉద్యోగుల ఆందోళన..

    కాంగ్రెస్‌ సర్కార్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో తెలియజేసే దృశ్యాలు ప్రతీ రోజు కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు ఆశాకార్యకర్తలు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కూడా చేపట్టారు. కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు రాష్ట్ర పరిపాలనకు తలమానికంగా నిలిచే సెక్రటేరియట్‌లో పని చేసే ఉద్యోగులు సైతం కదం తొక్కారు.సెక్రటేరియట్‌ ఉద్యోగులు తెలంగాణ సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట నిరసనకు దిగారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, డీఏలు, ఈహెచ్ఎస్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులంతా కలిసి బాహుబలి ద్వారం ఎదుట నిరసనకు దిగారు. రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియో మరోసారి చెప్పకనే చెబుతోంది.