Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హైదరాబాద్ లో మెరుపు ధర్నా- ఉద్రిక్తత

    Author VENKATESH | 31 Aug 2026, 04:21 PM | హైదరాబాద్
    హైదరాబాద్ లో మెరుపు ధర్నా- ఉద్రిక్తత

    హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడిని నిరసిస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఆఫీస్ లోనికి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు నల్లజెండాలు ప్రదర్శించారు. దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. యూత్ కాంగ్రెస్ ముట్టడి పిలుపు నేపథ్యంలో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసనకారులు లోపలికి దూసుకెళ్లకుండా బారికేడ్లను అమర్చారు. ఆ బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా వివిధ విద్యా పరీక్షల నిర్వహణలో జరుగుతున్న లోపాలు, పేపర్ లీకేజీల వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లే యువత రోడ్లపైకి వచ్చి పోరాడాల్సి వస్తోందని అన్నారు. విద్యార్థుల ఆగ్రహానికి కారణమైన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోందని, ఇప్పుడు హోం శాఖ కూడా విద్యార్థులపై హింసను ప్రేరేపించడం సిగ్గుచేటని అన్నారు.