Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్ సేవల్లో అంతరాయం

    Author VENKATESH | 29 Aug 2026, 12:15 PM | TELANGANA
    హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్ సేవల్లో అంతరాయం

    భాగ్యనగరంలో మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. ఆన్‌లైన్‌లో ముందుగానే టికెట్లు కొనుగోలు చేసుకున్న ప్రయాణికులు మెట్రో స్టేషన్ల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టికెట్ తీసుకున్నప్పటికీ ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద స్కానింగ్ సమస్యలు తలెత్తడంతో ప్రయాణికులు క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్‌లైన్ సేవలు పనిచేయకపోవడంతో మెట్రో స్టేషన్ సిబ్బంది కూడా చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది.