Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రాష్ట్రాన్ని నాశ‌నం చేయాల‌న్న‌దే వైఎస్ జ‌గ‌న్ సంక‌ల్పం

    Author VENKATESH | 29 Aug 2026, 12:07 PM | ANDHRA PRADESH
    రాష్ట్రాన్ని నాశ‌నం చేయాల‌న్న‌దే వైఎస్ జ‌గ‌న్ సంక‌ల్పం

    వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగ‌న్‌మోహ‌న్ రెడ్డి కొనసాగించిన విధ్వంసాన్ని భరించలేకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పార్టీని దారుణంగా ఓడించారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే జగన్ ఏకైక సంకల్పమని ఆరోపించారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై ప్రశ్నించే సత్తా లేని జ‌గ‌న్ కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే మీడియా ముందుకు వచ్చి విమర్శలు గుప్పిస్తున్నారనిమండిపడ్డారుప్రశ్నించడానికి ఎంతో అవకాశం ఉన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ ఎందుకు రావడం లేదని రామ్మోహన్ నాయుడు ప్ర‌శ్నించారు. తన పార్టీ నేతలకు ఒక డైరెక్షన్ ఇవ్వడం కోసం, ఉనికిని కాపాడుకోవడం కోసమే ఆయన మాట్లాడుతున్నారని, కానీ ఆయన చేస్తున్న విమర్శల్లో ఏ ఒక్కదానికి నేటికీ ఆధారాలు చూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు రాకూడదు, ఏ ఒక్కరూ బాగుపడకూడదనే దుర్బుద్ధితోనే జగన్ ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆరోపించారు.