Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నిరుద్యోగులకు వరం ’డీఈఈటీ‘ యాప్‌

    Author VENKATESH | 28 Aug 2026, 01:25 PM | TELANGANA
    నిరుద్యోగులకు వరం ’డీఈఈటీ‘ యాప్‌

    డిగ్రీ, పీజీలు పూర్తిచేసి ఉద్యోగాల వేటలో ఉన్న నిరుద్యోగ యువతకు సాంకే తికత అండగా నిలుస్తోంది. నోటిఫికేషన్‌ రాగానే ఇంటర్నెట్‌ సెం టర్లకు పరుగులు తీయడం, దరఖాస్తుల పేరిట ఫీజులు చెల్లించి జేబులు గుల్ల చేసుకోవడం ఇకపై తప్పనుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత ’డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ తెలంగాణ‘ (డీఈఈటీ) యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
    ఒకే వేదికపై కొలువుల సమాచారం
    ఈ యాప్‌ ద్వారా అభ్యర్థులు ఒకే ప్లాట్‌ఫామ్‌పై వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు, ఖాళీల వివరాలను సమగ్రంగా తెలుసుకోవచ్చు. మధ్యవర్తులు, నకిలీ ఉద్యోగ ప్రకటనల బారిన పడకుండా ఇది రక్షణ కల్పిస్తుంది. అభ్యర్థుల ప్రతిభ, విద్యార్హతలకు సరిపడే అవకాశాలను గుర్తించడంలో ఏఐ సాంకేతికత తోడ్పడుతుంది