Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సరిహద్దు రాష్ట్రాల్లో ఎన్‌డీఆర్ఎఫ్ హై అలర్ట్‌.. నేపాల్‌ వరదలపై అమిత్‌ షా

    Author VENKATESH | 27 Aug 2026, 01:39 PM | NATIONAL
    సరిహద్దు రాష్ట్రాల్లో ఎన్‌డీఆర్ఎఫ్ హై అలర్ట్‌.. నేపాల్‌ వరదలపై అమిత్‌ షా

    నేపాల్‌లో వరదల కారణంగా చోటుచేసుకున్న విధ్వంసంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విపత్తులో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సంక్షోభ సమయంలో భారత్‌ నేపాల్‌కు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. నేపాల్‌లో వరదల ప్రభావంపై బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రులతో తాను మాట్లాడినట్లు అమిత్‌ షా తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో వరదల ప్రభావం కనిపించే అవకాశం ఉన్నందున స్థానిక యంత్రాంగాలను, సహాయక బృందాలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు.నేపాల్‌ వరదల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సరిహద్దు ప్రాంతాల్లో ఎన్‌డీఆర్ఎఫ్ ను హై అలర్ట్‌లో ఉంచినట్లు అమిత్‌ షా తెలిపారు