Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ధనవంతులను చేస్తామని నమ్మించి.. బాలికను వివస్త్రగా మార్చి

    Author VENKATESH | 27 Aug 2026, 11:47 AM | ANDHRA PRADESH
    ధనవంతులను చేస్తామని నమ్మించి.. బాలికను వివస్త్రగా మార్చి

    మైనర్‌ను వివస్త్రగా మార్చి పూజలు చేసిన అమానుష ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. పూజల పేరుతో బాలికను ఓ మహిళ చిత్రహింసలకు గురిచేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ నిరుపేద కుటుంబం కళ్యాణదుర్గం నుంచి జీవనోపాధి నిమిత్తం అనంతపురంలో నివాసముంటోంది. వీరి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఓ మహిళ మాయమాటలు చెప్పి అభంశుభం తెలియని బాలికను ఇబ్బందులకు గురిచేసింది. వివస్త్రగా పూజలు చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారంటూ బాలిక తల్లిదండ్రులకు మహాలక్ష్మి అనే మహిళ నమ్మించింది.హేమంత్ కుమార్ అనే వ్యక్తి బాలికను ఓ రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి వివస్త్రను చేసి పూజలు చేశాడు. ఈ నెల 9న బాలిక, ఆమె తల్లిని మరోసారి కడపకు తీసుకెళ్లి పూజల పేరుతో చిత్ర హింసలకు గురిచేసింది. ఈ నెల 11న మరోసారి పూజల పేరుతో బాలికను, ఆమె తల్లిని కారులో తీసుకువెళ్తుండటాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలిక, ఆమె తల్లిని వదిలిపెట్టి సదరు మహిళ పరారైంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన కడప పోలీసులు.. అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. నిందితుల వివరాలను సేకరించిన పోలీసులు.. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.