Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నేపాల్‌లో జ‌ల ప్ర‌ళ‌యం..

    Author VENKATESH | 27 Aug 2026, 11:15 AM | NATIONAL
    నేపాల్‌లో జ‌ల ప్ర‌ళ‌యం..

    నేపాల్‌లో వ‌చ్చిన ఆక‌స్మిక వ‌ర‌ద‌ల్లోగ‌ల్లంతైన‌వారిలో ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన 32 మంది ఉన్న‌ట్లు తెలిసింది. వారంతా ఓ గ్రూపుగా మాన‌స‌స‌రోవ‌ర యాత్ర‌కు వెళ్లారు. అయితే వ‌ర‌ద‌లు రావ‌డానికి ముందు వ‌ర‌కు కాంటాక్టులో ఉన్న వారు.. ప్ర‌స్తుతం ఆచూకీ తెలియ‌డం లేద‌ని చెప్పారు. ఆ బృందంలో 30 మంది ప‌ర్యాట‌కులు, ఇద్ద‌రు టూరు మేనేజ‌ర్లు ఉన్నారు. ఆగ‌స్టు 21వ తేదీన ఆ గ్రూపు కోల్‌క‌తా నుంచి నేపాల్ బ‌య‌లుదేరింది. 22వ తేదీన వారు నేపాల్ చేరుకున్నారు. అయితే బుధ‌వారం ఆ గ్రూపు టిబెట్‌లో ప్ర‌వేశించేందుకు ర‌సువాగాధి చేరుకున్నారు. ఉద‌యం 8.30 నిమిషాల‌కు ఆకస్మికంగా వ‌ర‌ద‌లు వ‌చ్చిన స‌మ‌యంలో ఇమ్మిగ్రేష‌న్ ఆఫీసు వ‌ద్దే ఆ గ్రూపు ఉన్న‌ట్లు తెలిసింది.ఫ్లాష్ ఫ్ల‌డ్స్ వ‌చ్చిన త‌ర్వాత ఆ 32 మందిలో ఒక్క‌రు కూడా ట‌చ్‌లోకి రాలేద‌ని అధికారులు చెప్పారు. టిబెట్‌-నేపాల్ బోర్డ‌ర్‌లో వ‌చ్చిన వ‌ర‌ద‌ల వ‌ల్ల మృతుల సంఖ్య ప్ర‌స్తుతం 157గా ఉంది. వంద‌ల సంఖ్య‌లో జ‌నం గ‌ల్లంతు అయ్యారు. దీంట్లో భార‌తీయుల సంఖ్య 133గా ఉన్న‌ట్లు భావిస్తున్నారు. బెంగాల్ యాత్రికుల మిస్సింగ్ ప‌ట్ల ఆ రాష్ట్ర సీఎం సువేందు అధికారి తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కోల్‌క‌తా గ్రూపు టూరుకు బ‌య‌లుదేరింది.