Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం అధికారుల తీవ్ర నిర్లక్ష్యం

    Author VENKATESH | 25 Aug 2026, 01:10 PM | TELANGANA
    స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం అధికారుల తీవ్ర నిర్లక్ష్యం

    రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం అధికారుల తీవ్ర నిర్లక్ష్యం, సమన్వయ లోపం కారణంగా గందరగోళంగా మారింది. తూప్రాన్‌ మున్సిపాలిటీ 4వ వార్డు పరిధిలో 14వ నంబర్‌ రేషన్‌షా్‌పలో లబ్ధిదారులకు స్మార్ట్‌కార్డులను పంపీణీని సోమవారం ఉదయం రెవెన్యూ అధికారులు, మున్సిపల్‌వార్డు అధికారులు ప్రారంభించారు. అయితే కార్డులపై గ్రామం పేరు తప్పుగా ఉండటంతో అవాక్కయ్యారు.తూప్రాన్‌ పట్టణానికి చెందిన లబ్ధిదారుల కార్డులపై మున్సిపాలిటీ పేరుకు బదులుగా మండలంలోని వట్టూర్‌ గ్రామం పేరు ముద్రించారు. లబ్ధిదారులు ఆందోళన వ్యక్తంచేయడంతో అప్రమత్తమైన అధికారులు కార్డుల పంపిణీ ప్రక్రియను అర్ధాంతరంగా నిలిపివేశారు. కార్డులపై తప్పిదంపై కౌన్సిలర్‌ జైపాల్‌నాయక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన వివరాలతో కొత్తకార్డులు తిరిగి ముద్రించి అందజేయాలని డిమాండ్‌ చేశారు.