Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రమాదాలకు నిలయంగా ఏటూరు నాగారం- మంగపేట ప్రధాన రహదారి

    Author VENKATESH | 24 Aug 2026, 09:01 PM | ములుగు
    ప్రమాదాలకు నిలయంగా ఏటూరు నాగారం- మంగపేట ప్రధాన రహదారి

    * ఇసుక లారీల ఇష్టారాజ్యం
    పదుల సంఖ్యలో ప్రమాదాలు
    * గాలిలో కలిసిపోతున్న
    అమాయకుల ప్రాణాలు
    * రోడ్డున పడుతున్న ప్రయా
    ణికుల కుటుంబాలు
    * పట్టించుకోని ప్రజాప్రతినిధులు నిద్రావస్థలో అధికారులు
    * ప్రభుత్వాలు మారిన ప్రధాన రహదారి తలరాత మారేదెన్నడు?
    ములుగు జిల్లా ప్రతినిధి,
    ఆగస్టు 24(బి వి కె న్యూస్):
    ప్రమాదాలకు నిలయంగా మారిన ఏటూరునాగారం మంగపేట ప్రధాన రహదారి మితిమీరిన వేగంతో
    ఇసుక లారీల ఇష్టారాజ్యం వలన ప్రతిరోజు పదుల సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా , నిత్యం
    ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా, ప్రయాణికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నా,
    రహదారులు రక్త శిక్తం అవుతున్నా, ప్రధాన రహదారుల సైతం భారీ గుంతల మయం అవుతున్నా,కోట్ల రూపాయల రోడ్లు నాశనం అవుతున్నా అధికారులు, ప్రభుత్వం, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంలో అంతర్యం ఏమిటనీ? వాహనదారులు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    నేను ప్రస్తుతం ఏటూరునాగారం నుంచి మంగపేటకు కారులో వస్తున్నాను. ఈ కొద్ది దూరంలోనే రెండు ప్రమాదాలు కళ్లారా చూశాను. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు.
    ముఖ్యంగా జీడివాగు దగ్గర రోడ్డు పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది. గోరమైన గుంతలు ఏర్పడి, రోడ్డుపై ఉన్న ఇనుప సువ్వలు పైకి లేచి కనిపిస్తున్నాయి. ఒక ఆటో కొద్దిలో అదుపుతప్పి కింద పడే పరిస్థితి ఏర్పడిందనీ ఇసుక
    లారీలు, భారీ వాహనాలు ఎదురుగా వస్తూ రోడ్డు మొత్తం ఆక్రమిస్తున్నాయి. కొంతమంది డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారనే అనుమానం కలిగించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయనీ
    మొన్న కూడా గంపోనిగూడెం చివర్లో గుంతలో బైక్ పడిపోవడంతో ఇద్దరు గాయాలపాలయ్యారు. ప్రతిరోజూ ఈ రహదారిపై ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకున్న సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు?
    ఈ రోడ్డు పరిస్థితి అధికారుల కళ్లకు కనిపించడం లేదా?
    కళ్లుమూసుకుని ఉన్నారా?
    మరో పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన తర్వాతే స్పందిస్తారా?
    ఇది ఎవరో ఒకరి సమస్య కాదు,ఏటూరునాగారం–మంగపేట రహదారిపై ప్రతిరోజూ ప్రయాణించే వేలాది మంది ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం సంబంధిత
    రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ ర్లు వెంటనే స్పందించి ప్రమాదకరమైన గుంతలను పూడ్చి, పైకి లేచిన ఇనుప సువ్వలను తొలగించి, రహదారిని సురక్షితంగా మార్చాలని, ప్రమాదం
    జరిగిన తర్వాత పరిహారం ఇవ్వడం కంటే, ప్రమాదం జరగకముందే రోడ్డును బాగు చేయడం అధికారుల బాధ్యతనీ
    ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ అధికారులను, ప్రభుత్వాన్ని కోరారు.