Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కుమ్మరి వృత్తి రక్షణే

    Author VENKATESH | 24 Aug 2026, 08:59 PM | హైదరాబాద్
    కుమ్మరి వృత్తి రక్షణే

    మన సంస్కృతి ఆరోగ్య సంరక్షణ
    మానవ నాగరికతకు కుమ్మరి
    తొలిమెట్టు కుండ ఆరోగ్యానికి
    ఆయువు పట్టు
    ఆదిమ మానవుని నుండి
    ఆధునిక మానవ పరిణామ
    క్రమంలోకుమ్మరి చక్రం ఒక గొప్ప
    ఆవిష్కరణ పర్యావరణాన్ని
    సహజ వనరులను కాపాడుతూ
    సాగే కుమ్మర వృత్తి మానవాళికి
    ప్రకృతి అందించిన వరం అన్న
    బాపూజీ వాక్య పాలకులకు
    కనువిప్పు కావాలి
    మానవ నాగరికతకు సంస్కృతి
    చరిత్ర నిర్ధారణకు కుమ్మర వృత్తి
    సృష్టికి మూలాదారమై నిలిచింది
    శ్రమజీవి హస్తకళలనైపుణ్యానికి
    మట్టి ముద్ద ఒక నిదర్శనం
    కళాకృతులకు ప్రాణం పోసే
    సహజ సృజన కారులు కుమ్మర్లు
    కుమ్మరి చక్రం ఆధునిక
    పారిశ్రామిక ప్రగతికి
    మూలరూపమై నిలిచింది
    కుమ్మరి వృత్తి గ్రామీణ ఆర్థిక
    వ్యవస్థకు మూల స్థంభమని
    మహాత్మా గాంధీ పేర్కోవడం
    కుమ్మరి వృత్తి ఉనికికి నిదర్శనం
    ప్రాణమున్న మట్టిని తెచ్చి
    చక్రంపైపెట్టి చెమట చుక్కలు
    కలిపి జీవం పోస్తాడు కుమ్మరి
    అగ్ని గర్భంలో కాలి రూపు
    దిద్దుకున్న ఆ మట్టి పాత్ర
    మానవ మనుగడను అందిస్తుంది
    ప్రజలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది
    రంజన్ మినరల్స్ విటమిన్స్
    తో కూడిన నీరు ఇస్తుంది
    సహజ సిద్ధమైన ఫిల్టర్ గా
    పనిచేసి శుద్ధ జలాన్ని
    నిల్వచేస్తుంది
    గాంధీజీ చెప్పినట్లు మానవ శరీరం
    పంచభూతాలతో నిర్మితమైంది
    అందులో పృథ్వీ( మట్టి) ఒకటని
    మట్టిని నమ్ముకున్నదే కుమ్మరం
    మట్టి పాత్రలో వండిన వంట
    అమృతాహారం
    శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తుంది
    డయాబెటిక్ బీపీ క్యాన్సర్
    లాంటి రోగాలు రాకుండా
    కాపాడి రోగనిరోధక
    శక్తిని పెంచుతుంది
    నిరంతరం వాడితే
    థరి చేరదు అనారోగ్యం
    కుండ కేవలం నీటిని
    దాచుకునే పాత్ర కాదు
    అది మన ఆరోగ్యాన్ని
    కాపాడే అమృత భాండం
    కుమ్మరి చక్రం కేవలం
    కుండల తయారీకే కాదు
    మానవ నాగరికతకు
    ఆరోగ్యకరమైన నడక నేర్పింది
    మట్టి సేకరణ కష్టమై
    కుమ్మర వృత్తిదారులకు
    బ్రతుకు భారమైంది
    ఆధునిక యంత్రాల
    వెల్లువలో కుమ్మర వృత్తి
    వెనుకబడిపోయింది
    పెరిగిన ఉత్పత్తి ఖర్చులు
    మార్కెట్ సదుపాయాల
    కొరతతో కుమ్మర్ల బతుకు
    కుదేలైంది
    కుమ్మరవృతి దారులు
    పేదరికం నిరుద్యోగం
    వృత్తికి ఆదరణ లేక
    కొట్టుమిట్టాడుతున్నారం
    ప్రభుత్వాలు కదలాలి
    కుమ్మర వృత్తికి అండగా
    నిలవాలి వృతి శిక్షణ ఇవ్వాలి
    ఉచితంగా మట్టి తెచ్చుకునే
    హక్కును కల్పించాలి
    మట్టి కుంటల్లో క్షేత్ర స్థాయి
    సమస్యలను పరిష్కరించాలి
    ఆధునిక సాంకేతిక మద్దతుతో
    కొత్త యంత్రాలు అందించాలి
    సబ్సిడీ రుణాలు ఇవ్వాలి
    కాయకష్టం చేసే వృత్తిదారులకు
    ప్రమాద భీమా ఇవ్వాలి
    అమ్ముకునే మట్టిపాత్రలకు
    మట్టి ఉత్పత్తులకు వృత్తి ధరల
    భీమా మద్దతు ఇవ్వాలి
    మార్కెట్ ఇబ్బందులు తొలిగించి
    అమ్మకాలు ప్రోత్సహించాలి
    వృత్తి కళాకారులకు వార్షిక
    అవార్డులు ఇవ్వాలి
    ప్రభుత్వ కార్యాలయాల్లో
    మట్టి గ్లాసులు జగ్గులు వాడాలి
    ప్రభుత్వ నర్సరీల్లో మట్టి
    తొట్టిలు మాత్రమే వాడేట్లు
    ప్రభుత్వం జివో జారీచేయాలి
    కుమ్మరవృత్తి వృత్తిదారుల
    జీవితాల్లో ఆర్థిక వెలుగులు
    నింపాలి

    ప్లాస్టిక్ రసయనాల
    విషవలయంలో చిక్కుకున్న
    లోకానికి కుండ ఆరోగ్యానికి
    ఆయువుపట్టు కావాలి
    ఆర్థిక సహాయం సాంకేతికత
    ప్రభుత్వ రక్షణ తోడైతే కుమ్మరి
    బతుకు వెలుగుతుంది
    మట్టి పాత్రల వాడకంతో
    ప్రజారోగ్యం
    సంరక్షించబడుతుంది
    కుమ్మరి వృత్తికి ప్రభుత్వ భరోసా
    ఇస్తే మానవ ఆరోగ్యానికి మట్టి
    పాత్రలు భద్రతను ఇస్తాయి
    కుమ్మర వృత్తి దారులకు
    వృత్తి పరమైన ప్రమాద
    భీమా కల్పించాలి
    ప్లాస్టిక్ విష సంస్కృతిని
    వీడి ప్రభుత్వ మద్దతుతో
    మట్టి పాత్రల ఉత్పత్తిని
    వినియోగాన్ని ప్రోత్సహిద్దాం
    శ్రమజీవులకు చేయూతనిద్దాం
    తరతరాల కుమ్మరి సంస్కృతిని
    గౌరవిస్తూ ఆరోగ్యవంతమైన
    ఆరోగ్యకరమైన సమాజాన్ని
    నిర్మిద్దాం
    ప్రకృతి పర్యావరణ రక్షణకు
    ప్రజారోగ్యానికి మట్టి వాడకం
    శ్రీరామ రక్ష అన్న బాపూజీ వ్యాఖ్యను స్పూర్తిగా తీసుకొని
    కుమ్మర వృత్తికి పూర్వ
    వైభవం తెద్దాం చేతి
    వృత్తులకు చేయూత నిద్ధాం
    Zనేదునూరి కనకయ్య
    అధ్యక్షులు తెలంగాణ
    కుమ్మర సంఘం 880/2014
    తెలంగాణ రాష్ట్ర శాఖ
    అధ్యక్షులు తెలంగాణ
    ఎకనామిక్ ఫోరం
    హైదరాబాద్
    9440245771