Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 20వేల మంది జెన్‌జీ యువతతో మాటామంతి

    Author VENKATESH | 24 Aug 2026, 01:12 PM | ANDHRA PRADESH
    20వేల మంది జెన్‌జీ యువతతో మాటామంతి

    స్వామి వివేకానంద, శ్రీశ్రీ చెప్పినట్టు యువత పాత్రే దేశానికి కీలకమని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నేడు యువత.. దేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తోందని తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులన్న తేడా లేకుండా యువత రాజకీయ నాయకులను ప్రశ్నిస్తోందని.. ఇది మంచి నిర్ణయమని.. దీన్ని తాను కూడా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. 20 వేల మంది జెన్‌జీ యువతతో 55 రోజుల పాటు 51 చోట్ల మాటామంతి నిర్వహిస్తున్నామని తెలిపారు. రేపు(మంగళవారం) ఉదయం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.