Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇస్రోను మోదీ సర్కార్ బలహీనపరుస్తోంది..

    Author VENKATESH | 24 Aug 2026, 12:30 PM | NATIONAL
    ఇస్రోను మోదీ సర్కార్ బలహీనపరుస్తోంది..

    భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భవితవ్యంపై రాజకీయ దుమారం మొదలైంది. ఇస్రోను మోదీ సర్కారు బలహీనపరుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేష్ ఆరోపించారు. ఆరు దశాబ్దాలుగా ఇస్రో నిర్మించుకున్న సామర్థ్యాలను ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు.ఇస్రో భవిష్యత్ పాత్రకు సంబంధించి ఇటీవల వెలువడిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని జైరామ్ రమేష్ పేర్కొన్నారు. రాకెట్ల తయారీ, ప్రయోగ వాహనాల ఉత్పత్తిలో ఇస్రో పాత్రను గణనీయంగా తగ్గించి, ప్రైవేట్ సంస్థలకు ఎక్కువ బాధ్యతలు అప్పగించే దిశగా ప్రభుత్వం వెళ్తోందని ఆయన ఆరోపించారు. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల కృషితో ఇస్రో ఆరు దశాబ్దాలుగా అభివృద్ధి చేసుకున్న సామర్థ్యాలను, మౌలిక వసతులను ప్రైవేట్ రంగానికి అప్పగించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు