Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అన్నయ్యే ‘నా ఏకైక హీరో’.. పవన్ కల్యాణ్

    Author VENKATESH | 22 Aug 2026, 12:01 PM | ANDHRA PRADESH
    అన్నయ్యే ‘నా ఏకైక హీరో’.. పవన్ కల్యాణ్

    అన్నయ్య చిరంజీవి గురించి తలుచుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అన్నయ్యకు తమ్ముడు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేకమైన రోజున పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నప్పుడు, కొన్ని మధురమైన సంఘటనలు గుర్తొచ్చాయని అన్నారు. కాలేజీ విద్యార్థిగానే ఉన్నప్పటికీ, ప్రపంచంలోనే అత్యంత గొప్ప వ్యక్తితో నడుస్తున్నట్లు అనిపించేదన్నారు. ఆయన తన పొడవైన ఉంగరాల జుట్టు, దృఢమైన NCC క్యాడెట్ శరీరాకృతి, బెల్-బాటమ్ ప్యాంట్, కళ్లద్దాల పెట్టుకుని నాన్న బుల్లెట్(350 cc) బైక్ నడుపుతుంటే... అబ్బా! ఆ దృశ్యం ఒక అభిమానిగా ఆయనను ఆరాధించేలా చేసే అద్భుతమైన క్షణమని చెప్పుకొచ్చారు.‘సినిమా హీరో కాకముందే, మా అన్నయ్య నాకు ఎప్పుడూ ఒక హీరోలాగే ఉండేవారు. ఆయనకు పెళ్లయినప్పుడు, ఆయన మా అందరికీ దూరమైపోతారేమోనని నేను ఆందోళన చెందాను. నా కన్నీళ్లకు కారణం తెలుసుకుని అన్న, వదినా నవ్వుకున్నారు. ఆ తర్వాత, నన్ను చెన్నై తీసుకువెళ్లి అన్నయ్య, వదినల దగ్గర ఉంచారు. వారు నాపై చూపిన ప్రేమ, ఆప్యాయతలను వర్ణించడానికి మాటలు చాలవు. షూటింగ్‌ల సమయంలో ఆయన పడ్డ కష్టం, కృషి, గాయాలను నేను దగ్గరుండి చూశాను. చెన్నైలోని ఉక్కపోత, తేమ వాతావరణంలో 18 గంటల పాటు కఠినమైన పని చేసి, చెమటతో తడిసిన దుస్తులు, బూట్లతో అర్ధరాత్రి ఇంటికి చేరుకునేవారు. కానీ నా చదువులో వైఫల్యాల గురించి, జీవితంలో దిశానిర్దేశం లేకపోవడం గురించి ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. తన ఉదారతతో మా కుటుంబాన్ని, బంధువులను ఎంతగానో సంతోషపెట్టారు. అదే స్ఫూర్తిని తన స్నేహితులకు, నిర్మాతలకు, చిత్ర పరిశ్రమకు, ప్రతి ఒక్కరికీ పంచారు. దక్షిణాది, హిందీ చిత్ర పరిశ్రమల మధ్య సాంస్కృతిక వారధిగా పనిచేసిన ప్రధాన, కీలక వ్యక్తులలో చిరు ఒకరు’ అని పవన్ అన్నారు.